Friday, August 10, 2012

నా ప్రత్యేక కృతజ్ఞతలు

నా ప్రత్యేక కృతజ్ఞతలు
ఈ మేలుకలయిక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మదనపల్లి మిత్రులు సదాశివా రెడ్ది,నరేంద్ర,యష్వంత్, గొపాల్ రెడ్డి కి ప్రత్యేకంగా నా కృతఙ్ఞతలు ఈ బ్లొగ్ ద్వారా తెలియజేస్తున్నాను.మిత్రులారా స్వీకరించండి. 

స్నేహ బంధము ఎంత మధురము...

స్నేహ
బంధము ఎంత మధురము...
షుమారు
14000 రోజుల క్రితం విడిపోయిన మిత్రులం ఇప్పటి వరకు ఒకరినొకరం మరిచిపొకుండా మళ్ళీ కలుసుకోవాలని తాపత్రయ పడుతున్నాం అంటే బంధం నిజంగా ఎంత మధురము. ఆచార్య ఆత్రేయ చెప్పినట్టు అది తరిగిపోదు చెరిగిపోదు జీవితాంతము.
5
ఆగస్టు 2012 బిసెంట్ దివ్య ఙ్ఞాన కళాశాల, మదనపల్లి మా స్నేహ బంధానికి వేదికగా నిలిచింది. 1972-74 లో ఇంటర్ బై పి సి చదివిన మేమంతా అంతర్జాతీయ స్నేహితుల దినం సంధర్భంగా కలుసుకున్నాము.అందుకు నాంది పలికింది అంతర్జాలం లొ నాకు వచ్చిన ఒక మెయిల్. అదొక కవిత రూపంలొ ఇలా వుంది ఇంగ్లీషులో, కాకపోతే నేను తెలుగు చేసినప్పుడు జాన్ బదులు సుబ్బారావు అని మార్చాను. టెలిగ్రాం అని వుంటే ట్రింగ్ ట్రింగ్.. అని అన్నాను.
నగరంలో
ఒక మూల...ఎల్లలు లేని మహా నగరంలో ఒక మూల నాకున్నాడో స్నేహితుడు,అత్యంత సన్నిహితుడు
కలిసే రొజులకన్నా మద్య మామద్య కలవని రొజులే ఎక్కువయ్యాయ్
వారాలు నెలలు పరుగిడుతుంటాయి
గమనించేలోగా సంవత్సరాలూ గడిచిపోతూనేవుటాయినా
మిత్రున్ని చూసి చాన్నాల్లయ్యింది అనుకుంటాను
ఏం చేద్దాం వడివడిగా జీవితం ,అదొక పరుగు పందెం
మావాడికి తెలుసు వాడంటే నాకిష్టమని
వాడూ నేనూ పోటీలు పడి హజరయ్యాం ఒకరింటికి ఒకరం
ఆరొజుల్లో- అప్పుడు మేము యువతరంఇప్పుడు
మేము - అలసి సొలసిన మనుషులం
లేదిప్పుడు క్షణమైన తీరిక
ఒక పేరు కోసం, ఒకపేగుకోసం,ఒక ఉనికి కోసం
ఒక తెలివిలేని క్రీడలో తప్పాం తెలివంతానీగురించి
నేనెప్పుడూ తలుస్తుంటానని ఛెప్పాలనుకుంటాను
రేపెట్లాగైనా కలవాలని కలగంటాను
రేపొస్తుంది, వచ్చినట్లే వచ్చి వెళ్ళీ పొతుంది
మా ఇద్దరి మద్యా కాలం ఇంతింతవుతుంది
నగరంలో మూల దూరం అంతకంతా పెరుగుతుందిట్రింగ్ ట్రింగ్ ...హతోస్మి!! మా సుబ్బారావు ఇక లేడా !!!
నగరంలో ఒక మూల ఒక సన్నిహితుని అదృశ్యం.అదా మనకు దక్కింది, అదా చివరకు మిగిలింది
కవిత చదివాక నేను స్నేహితుల్ని ఎంతగా మిస్ అవుతున్నానో అనిపించింది. ఇక నేను నా ఇంటర్ మిత్రుడు సదాశివ రెడ్డి ఇద్దరం మా క్లాస్ లోని ఇతర మిత్రుల ఫోన్ నంబర్లు సేకరించే పనిలోపడ్డాం సంవత్సరం మొదట్లో.
కాలేజిలో
అడ్మిషన్ రికార్డ్ కాపీ తీసుకుని మా మిత్రులు ఊర్లనుంచి వచ్చారో ఊర్లకు ఫొను చేసి 40ఏళ్ళ క్రితం మీ ఊరినుంచి ఫలానివారు చదివారు వారు వున్నారా? అని వూర్లో ఎవరినో ఒకరిని అడగటం, వారిచ్చిన వివరాలతొ మరింత ముందుకెళ్ళటం జరిగేది.కొంతమంది నంబర్లు సేకరించాక వారిద్వారా మరికొంతమంది ఇలా సేకరణ సాగింది.97 మంది వున్న క్లాసులో 65 మంది తొ మాట్లాడాము. తేదీ ఖరారు చెసి రమ్మని చెప్పాము మేలుకలయికకు.
కాలేజీలోనే
మేము చదువుకున్న ఒక గది పేరు కింగ్స్ రూము. రూములో సమావేశం. ముందురోజు ప్రిన్సిపాలుగారితొ మాట్లాడి అనుమతి తీసుకున్నాము.మాకు పాఠాలు చెప్పిన గురువుల్ని కూడా ముందురొజే కలిసి వారిని మేలుకలయికకు ఆహ్వానించాము.వారంతా ఇప్పు డు 70 పడిలో వున్నారు. చాలా మంది లేరు అందుబాటులో మదనపల్లిలో. ఒక ఐదు మంది మాత్రం హాజరయ్యారు. ఒక గురువు గారు మాట్లాడుతూ, రాత్రంతా నిద్ర పట్టలేదురా, మీరంతా ఇప్పుడు ఎలా వుండివుంటారు, మీరంతా కలవటం ఎలా సాధ్యమైంది అని ఆలొచిస్తుంటే అన్నారు.
మా
మేలుకలయిక ప్రొద్దున పది గంటలకు మొదలయ్యింది.ఒక్కరొక్కరు వస్తున్నారు, ఆశ్చర్యం, ఆనందం ముప్పిరిగొన్నాయి. ఒక్కో మిత్రుడ్ని,మిత్రురాల్ని గుర్తు పట్టినప్పుడల్లా కేకలు,రచ్చలు, కేరింతలు. అందరూ జీవితంలొ బాగా సక్సస్ అయ్యి, పెద్ద హోదాల్లో వున్నారు. అవన్నీ మరిచి అరుపులతో తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
చాలామంది
అమ్మమ్మలు,నానమ్మలు,తాతయ్యలు అయివున్నారు. కొంతమంది కుటుంబసభ్యులతొ, సహచరులతొ వచ్చారు. సభలో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.తొలుత నేను మేలుకలయిక పూర్వపరాలు చెప్పాను. తర్వాత హాజరయిన మిత్రులంతా ఒక్కరొక్కరూ నలబయి యేళ్ళలో వారి జీవితంలో జరిగిన విషయాల్ని అందరికి తెలియబరిచారు.అప్పట్లొ క్లాసులో జరిగిన హాస్య సన్నివేశాల్ని నెమరు వేసుకున్నారు. మేలుకలయిక ఏర్పా టు చేసిన ని ర్వాహకులకు పేరు పేరున కృతఙ్ఞతలు తెలిపారు.
38
యేళ్ళ క్రితం విడిపోయి ఇప్పుడు కలుసుకు ని ఎప్పటికీ మిగిలిపొయే మధురస్మృతుల్ని మూట కట్టుకుని బరువయిన హృదయాలతో అందరం వెనుదిరిగాము స్నేహ బంధము ఎంత మధురమూ అనుకుంటూ.